
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని సృష్టించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారని కలెక్టర్ సిరి తెలిపారు. ఆమె వ్యక్తిగతంగా ఘటన స్థలాన్ని పరిశీలించారు.
“ఒక బైక్ బస్సు కింద చిక్కడంతో, ముందు తలుపును ఓపెన్ చేసే కేబుల్ తెగిపోయింది. ఈ కారణంగా ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. ఇప్పటివరకు 11 మృతదేహాలు వెలికితీసార, ఇక డ్రైవర్ ప్రమాదం తర్వాత తప్పించుకున్నాడు అని ఇప్పటివరకున్న సమాచారం. మరో 20 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు,” అని కలెక్టర్ తెలిపారు.
పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న హైమరెడ్డి బస్సులో మంటలు చెలరేగడాన్ని గమనించి పోలీసులను తెలుపారు అని పేర్కొన్నారు. ఆమె తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఏది ఏమైనా, కావేరి ట్రావెల్స్ నిర్లక్ష్యం వల్ల, ఇంత మంది ప్రాణాలు పోయాయి అని, ప్రజలు తన ఆవేదనని వేక్తపరిచారు. మరి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటాడో వేచి చూడాలి.
