ఇండియా–సౌతాఫ్రికా మ్యాచ్ టుడే: పూర్తి ప్రీవ్యూ మరియు అంచనాలు

ఇండియా–సౌతాఫ్రికా మ్యాచ్ టుడే

భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్–దక్షిణాఫ్రికా మ్యాచ్ ఈరోజు జరగనుంది. రెండు జట్లు కూడా సమాన బలం కలిగి ఉండటంతో ఈ పోరు హై-వోల్టేజ్‌గా మారింది. ఇటీవలీ ఫామ్, ప్లేయర్ల ప్రదర్శన, పిచ్ పరిస్థితులు అన్ని కలిసి మ్యాచ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చాయి.

ఇక ఈరోజు మ్యాచ్ మొదలైంది, సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం మన ఇండియా 62 పరుగులు చేసి రెండు వికెట్స్ కోల్పోయింది. రోహిత్ శర్మ మరియు జైస్వాల్ అవుటయ్యారు.

అయితే మునుపటి మ్యాచ్ లో కోహ్లీ విజృంభణ చూసిన అభిమానులు, ఈరోజు కూడా అలాగే ఉంటుంది అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కోహ్లీ ప్రస్తుతం 13 పరుగులు చేసాడు.

రన్ రేట్ పరంగా చూసుకుంటే తక్కువే ఉంది, అయితే ఇంకో 15 ఓవర్లు అయినా స్లోగా ఆడితే రన్  రేట్ పెరుగుతుంది. మల్లి 300 టార్గెట్ ఇస్తే, మ్యాచ్ మంచి రసవత్తరంగా ఉంటుంది.

ఇరు జట్ల మధ్య ఎప్పటిలాగే ఈ మ్యాచ్ కూడా అభిమానులను కట్టిపడేసేలా ఉంటుందని స్పోర్ట్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related Articles

Latest Articles