డైస్ ఈరే తెలుగు వెర్షన్‌కు ఓటీటీ డేట్ ఫిక్స్

డైస్ ఈరే తెలుగు వెర్షన్‌కు ఓటీటీ డేట్ ఫిక్స్

“భ్రమయుగం” సినిమాతో పేరు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ సదాశివన్ మరో ప్రత్యేకమైన చిత్రం డైస్ ఈరే తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రణవ్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగులో థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకుంది.

ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో ప్రసారం కానుంది. డైస్ ఈరే డిసెంబర్ 05, 2025న జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ సినిమాలో ప్రణవ్ మోహన్‌లాల్, షైన్ టామ్ చాకో, సుష్మిత భట్, గిబిన్ గోపీనాథ్, సైజు కురుప్ తదితరులు నటించారు.

రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి షెహ్నాద్ జలాల్ సినిమాటోగ్రఫీ అందించగా, క్రిస్టో జేవియర్ సంగీతం సమకూర్చారు. చిత్రాన్ని చక్రవర్తి రామచంద్ర & ఎస్. సశికాంత్ నిర్మించారు.

Related Articles

Latest Articles