నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తున్న బాహుబలి ఎపిక్ వెర్షన్

నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తున్న బాహుబలి ఎపిక్ వెర్షన్

భారీ అంచనాల మధ్య విడుదల అయిన ‘బాహుబలి: ది ఎపిక్’ థియేటర్లలో విడుదలైన తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.

ఈ సినిమా డిసెంబర్ 25, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. అయితే, ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉంటుందా లేదా అనే విషయంలో ఇప్పటివరకు అధికారిక స్పష్టత లేదు.

అందరికీ తెలిసిందేనట్లుగా, ‘బాహుబలి: ది ఎపిక్’ అనేది ‘బాహుబలి: ది బిగినింగ్’ మరియు ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ సినిమాలను కలిపి రూపొందించిన చిత్రమిది. ఈ చిత్రం మొత్తం నిడివి సుమారు 3 గంటలు 40 నిమిషాలు ఉంటుంది.

నిడివి ఎక్కువగా ఉన్నప్పటికీ, సినిమా అభిమానులు మరియు ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై భారీ ఆసక్తి నెలకొంది. ఓటీటీ విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక, ‘బాహుబలి: ది ఎపిక్’ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది. గత రెండు భాగాల్లో లేని కొన్ని కొత్త సన్నివేశాలను దర్శకుడు రాజమౌళి ఇందులో చేర్చడంతో, ఈ వెర్షన్ మరింత ఆకట్టుకునేలా ఉంటుంది.

Related Articles

Latest Articles