
ఇటీవల మలయాళంలో భారీ విజయం సాధించిన ‘ఎకో’ సినిమా త్వరలో ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా నెమ్మదిగా సాగుతూ ఉత్కంఠను పెంచే మిస్టరీ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను చివరి వరకు కుర్చీలకు అతుక్కుపోయేలా చేసింది. ఊహించని మలుపులతో కథ ఆసక్తిగా సాగుతుంది.
ఎకో సినిమా డిసెంబర్ 31, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రం తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది.
ఈ సినిమాలో సందీప్ ప్రదీప్, వినీత్ నారాయణ్, బిను పప్పు, అశోకన్, బియానా మోమిన్, సిమ్ జీ ఫీ, ఎన్‌జీ హంగ్ షెన్, రంజిత్ శేఖర్, సాహీర్ మహమ్మద్ తదితరులు నటించారు.
ఈ కథను బహుల్ రమేష్ రాశారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను కూడా ఆయనే నిర్వహించారు. సంగీతాన్ని ముజీబ్ మజీద్ అందించగా, ఎంఆర్‌కే జయరామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
