Avatar 3 Review Telugu: ప్యూర్ సినిమాటిక్ అనుభవం

Avatar 3 Review Telugu

జేమ్స్ కామెరూన్ అవతార్ ఎంత సంచలనం సృష్టించిందో మనకి తెల్సిందే. అవతార్ 2 కూడా బాగా ఆడింది. ఇక ఇప్పుడు అవతార్ 3 తో వచ్చారు.

కథ

ఈసారి కథ మరింత వ్యక్తిగతంగా, భావోద్వేగాలతో నిండిపోయింది. కుటుంబం, త్యాగం, గుర్తింపు, మనుగడ వంటి అంశాలు గత భాగాల కంటే బలంగా ప్రేక్షకులను తాకుతాయి. కథలో కొత్తదనం చూపించకపోయినా, ఎమోషనల్ కనెక్ట్ మాత్రం బాగుంది.

సృష్టించిన పాండోరా ప్రపంచం మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ‘అవతార్ 3’ కేవలం ఒక సినిమా కాదు, ఇది ఒక విజువల్ ఎక్స్‌పీరియెన్స్. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం, విజువల్స్, సౌండ్, ఎమోషన్ పరంగా మరో స్థాయికి తీసుకెళ్లింది.

‘అవతార్ 3’లో కొత్తగా పరిచయమైన మాంగ్క్వాన్ క్లాన్ కథకు కొత్త డైమెన్షన్ తీసుకొచ్చింది. ఈ క్లాన్ ద్వారా పాండోరా ప్రపంచం మరింత చీకటి, రా, ఎమోషనల్‌గా కనిపిస్తుంది. ఈ కొత్త ప్రపంచం విజువల్‌గా, కథాపరంగా ఆకట్టుకుంటుంది కానీ నేరేషన్ మాత్రం పార్ట్ 2 తరహాలోనే సాగడం వల్ల, ఇది కొంతవరకు ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌లా అనిపిస్తుంది.

ఇంటర్వెల్ తర్వాత సినిమా బాగా ఎలివేట్ అయింది. సెకండ్ హాఫ్‌లో వచ్చే సంఘర్షణలు, భావోద్వేగాలు కథకు ప్రాణం పోశాయి. ముఖ్యంగా క్లైమాక్స్ మాత్రం పవర్‌ఫుల్‌గా, భావోద్వేగంగా, విజువల్‌గా షాక్ ఇచ్చే స్థాయిలో ఉంది.

VFX, CGI, సౌండ్ డిజైన్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఇలా ప్రతి టెక్నికల్ విభాగం హాలీవుడ్‌లోనే కాదు, ప్రపంచ సినీ పరిశ్రమలో ఒక బెంచ్‌మార్క్‌గా నిలుస్తుంది. ప్రతి ఫ్రేమ్ ఒక మూవింగ్ పెయింటింగ్‌లా కనిపిస్తుంది. ఇది సినిమా కాదు, ఒక విజువల్ జర్నీ అనిపిస్తుంది. IMAX, 3D ఫార్మాట్‌లో చూస్తే అనుభవం రెట్టింపు అవుతుంది.

అయితే సినిమా లెంగ్త్ మరి ఎక్కువైపోయింది. కథా నేరేషన్ పార్ట్ 2ని గుర్తు చేసే విధంగా ఉండటం వల్ల, కొత్తగా ఉత్సాహపరిచే ట్విస్టులు తక్కువగా కనిపిస్తాయి. స్టోరీ పరంగా పెద్ద సర్‌ప్రైజ్‌లు లేకపోయినా, మేకింగ్ మాత్రం ఆ లోటును కవర్ చేస్తుంది.

మొత్తానికి ‘అవతార్ 3’ కథలో పెద్ద సంచలనాలు చేయకపోయినా, సినిమాటిక్ అనుభవంలో మాత్రం శిఖర స్థాయిని తాకింది. జేమ్స్ కామెరూన్ ఎందుకు మాస్టర్ స్టోరీటెల్లర్ అనేది మరోసారి నిరూపించాడు.

సినిమాటిక్ అనుభవం కోసం, థియేటర్లో ఈ సినిమాని ఖచ్చితంగా చూడాల్సిందే.

రేటింగ్: 3.75/5

Related Articles

Latest Articles