బాహుబలి ది ఎటర్నల్ వార్ టీజర్ విడుదల: వినూత్నమైన కాన్సెప్ట్

Baahubali The Eternal War Teaser is Out Now

బాహుబలి అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది! ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ టీజర్ ఇప్పుడు అధికారికంగా డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో విడుదలైంది.

ఈ టీజర్‌ను తొలిసారి ‘బాహుబలి: ది ఎపిక్’ రిలీజ్ సందర్భంగా థియేటర్లలో ప్రదర్శించగా, తెరపై చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యంతో మైమరచిపోయారు. ఇప్పుడు ఆ అద్భుతమైన టీజర్ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చింది.

ఈ టీజర్ విజువల్‌గా ఓ మాస్టర్‌పీస్ లాగా కనిపిస్తోంది. ప్రతి ఫ్రేమ్‌లో ఉన్న గ్రాఫిక్ క్వాలిటీ, యానిమేషన్ డీటైల్స్ అద్భుతంగా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో రూపొందిన ఈ యానిమేషన్ చిత్రం, ఖచ్చితంగా తెలుగు సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది.

ఈసారి కథ పూర్తిగా భిన్నంగా ఉండబోతోందని టీజర్‌లోనే స్పష్టమైంది. భూమిపై మరణించిన బాహుబలి, పాతాళ లోకంలో దేవతలతో యుద్ధం చేస్తూ, తన ధర్మయుద్ధాన్ని కొనసాగిస్తాడు. ఈ వినూత్నమైన కాన్సెప్ట్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేపుతోంది.

బాహుబలి: ది ఎటర్నల్ వార్ టీజర్ ఇప్పుడు తెలుగు మరియు హిందీ భాషల్లో విడుదలైంది. రెండు భాషల్లోనూ ఈ టీజర్ అద్భుతమైన స్పందన పొందుతోంది.

Related Articles

Latest Articles