
‘బైసన్’ చిత్రం ఇప్పుడు ఓటిటీలో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో మంచి స్పందన పొందిన ఈ ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
ఇక ఈ చిత్రం తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ చిత్రంలో దర్శకుడు మారి సెల్వరాజ్ తన మార్క్ టేకింగ్ తో, మంచి సన్నివేశాలతో చిత్రాన్ని చాల బాగా తీసాడు. ఇక కిట్టయ్య గా ధృవ్ విక్రమ్ నటన సినిమాకి వెన్నెముకగా నిలిచింది.
ఓటిటీలో విడుదలైన తర్వాత, సోషల్ మీడియాలో కూడా ఈ చిత్రంపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి. ఒక మంచి ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామా చూడాలి అనుకుంటే, ఈ చిత్రంని మిస్ అవకుండా చుడండి.
