
నటుడు విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ హీరోగ చేసిన చిత్రం, ‘బైసన్’ సినిమా ఇప్పుడు తెలుగు థియేటర్స్‌లో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ స్పోర్ట్స్ డ్రామాను మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందించారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.
సినిమా కదేంటంటే, ఒక కబడ్డీ ఆటగాడు (ధృవ్ విక్రమ్), అయితే కులం కారణంగా ఊరు రెండు గ్రూపులుగా మారుతుంది. మరి వీటి మధ్య, తన జీవితం ఎలా మారింది అనేది కథ.
దర్శకుడు మారి సెల్వరాజ్ సినిమాలు, కులాల అణిచివేత గురించి చాలా లోతుగా చూపిస్తారు. ఈ సినిమా కూడా అలాంటిదే, అయితే ఈ సినిమా కొత్తగా ఎందుకు అనిపిస్తుంది అంటే, స్పోర్ట్స్ నేపథ్యం వల్ల.
మంచి కథా బలంతో పాటు, నటి నటుల నటన కూడా సినిమాకి చాల తోడ్పడింది. ముఖ్యంగా, ధృవ్ విక్రమ్ నటన గాని, తన నాన్న గా చేసిన పశుపతి గాని అడ్డరగొట్టారు. లాల్, అనుపమ పరమేశ్వరన్, రాజిషా విజయన్ కూడా మంచి నటన కనబర్చారు.
అయితే సినిమా బాగుంది కానీ, చాల స్లోగా వెళ్తుంది, అందువల్ల, తెలుగు ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయ్.
చివరగా, బైసన్ సినిమా చూడొచ్చా లేదా అంటే, ఖచ్చితంగా చూడొచ్చు.
రేటింగ్ : 2.25/5
