
బాలీవుడ్ స్పై యాక్షన్–డ్రామా చిత్రం ‘ధురంధర్’ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ సినిమాను డిసెంబర్ 19, 2025న తెలుగులో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు సమాచారం. హిందీలో ఇప్పటికే మంచి బజ్‌ను క్రియేట్ చేసిన ఈ చిత్రం, ఇప్పుడు తెలుగు మార్కెట్‌లో కూడా భారీ అంచనాలతో అడుగుపెడుతోంది.
ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు, పవర్‌ఫుల్ కథనం, స్ట్రాంగ్ పాత్రలతో రూపొందిన ‘ధురంధర్’ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. మాస్ ఆడియన్స్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ సినిమా థియేటర్ అనుభవాన్ని మరింత ఎలివేట్ చేస్తుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తెలుగు వెర్షన్ కోసం ప్రత్యేకంగా డబ్బింగ్ మరియు డైలాగ్స్‌పై శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. పాత్రల భావోద్వేగాలు, యాక్షన్ ఇంటెన్సిటీ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరగా అనిపించేలా మార్పులు చేసినట్లు సమాచారం. దీంతో సినిమా థియేటర్లలో మరింత బలమైన ఇంపాక్ట్ చూపించే అవకాశముంది.
హిందీ లో మిస్ అయినవాళ్ళు, ఈ సినిమాని తెలుగులో మిస్ అవకుండా చుడండి.
