
తమిళంలో సంచలనం సృష్టించి, తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న “డ్యూడ్” సినిమా ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లోకి అడుగుపెడుతోంది. ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
రేపటి నుంచి “డ్యూడ్” మూవీ నెట్ఫ్లిక్ లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో చూడలేకపోయిన వాళ్ళు OTT లో మిస్ అవకుండా చుడండి.
మమితా బైజు తన సహజమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ సినిమా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాగే, సాయి అభ్యంకర్ అందించిన సంగీతం సినిమాకు ప్రాణం పోసిందని చెప్పవచ్చు. నేపథ్య సంగీతం, పాటలు, ఎమోషనల్ సీన్లను మరింత బలంగా మలిచాయి.
