జాకీ చాన్‌ ఫేక్‌ న్యూస్‌కి ఫుల్‌ స్టాప్‌ – “రిటైర్మెంట్‌ లేదు” అంటూ ప్రకటించిన యాక్షన్‌ లెజెండ్‌

Full Stop to Jackie Chan Fake News – The Action Legend Declares “No Retirement”

హాంగ్‌కాంగ్‌–హాలీవుడ్‌ యాక్షన్‌ స్టార్‌ జాకీ చాన్‌ చనిపోయాడు అనే వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

71 ఏళ్ల వయస్సులో ఉన్న ఆయన ఆరోగ్యం బాగోలేదని, ఆసుపత్రిలో చికిత్స పొందుతు చనిపోయారు అని పోస్టులు సోషల్‌ మీడియాలో వేగంగా వ్యాపించాయి.

దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే, ఈ వదంతులన్నీ పూర్తిగా అసత్యమని చాన్‌ ప్రతినిధులు స్పష్టం చేశారు.

ప్రస్తుతం జాకీ చాన్‌ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, ఎటువంటి అనారోగ్య సమస్యలూ లేవని వెల్లడించారు.

ఈ వదంతుల కారణంగా సోషల్‌ మీడియాలో నకిలీ ఫోటోలు, పాత వీడియోలు చక్కర్లు కొడ్తున్నాయి.

కొన్ని పేజీలు చాన్‌ ఆసుపత్రిలో ఉన్న ఫోటోలు అంటూ పాత దృశ్యాలను ప్రచురించాయి. అయితే అవన్నీ తప్పుడు అని ఫ్యాక్ట్‌ చెకర్లు నిర్ధారించారు.

జాకీ చాన్‌ అభిమానులు కూడా “ఆయన బాగానే ఉన్నారు” అని సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తూ ఈ వదంతులను ఖండిస్తున్నారు.

మొత్తం మీద, జాకీ చాన్‌ మరణ వదంతులు మరోసారి తప్పుడు అని తేలాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు ప్రేమించే ఈ స్టార్‌ ఇంకా యాక్షన్‌ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు.

Related Articles

Latest Articles