Good Luck Sakhi Review: కీర్తి సురేష్ షూటర్ గా ప్రధాన పాత్రలో నిటించిన సినిమా థియేటర్లలో ఈ రోజు జనవరి 28న గ్రాండ్ గా రిలీజ్ అయింది. తొలి రోజే ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఊరి ఆడపిల్లగా కీర్తి అద్భతంగా నటించిందని మూవీ చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోచ్ గా జగపతి బాబు నటన కూడా అద్భతంగా ఉందని అంటున్నారు. ఈ సినిమా గురించిన మరిన్ని విషయాలను తెలుసుకుందాం.

గుడ్ లక్ సఖి తారాగణం
నాగేశ్ కుకునూర్ ఈ సినిమాకు కథను అందించడంతో పాటు ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. సుధీర్ చంద్ర పదిరి ఈ మూవీను worth a lot motion arts బ్యానర్ పై నిర్మించారుు. కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చగా, చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు. రాహుల్ రామకృష్ణ, రమఫ్రభ కూడా ఈ మూవీలో లీడ్ రోల్స్ ప్లే చేశారు.
కథ విషయానికి వస్తే.. తెలంగాణ ఊరిలో సఖి (కీర్తి సురేశ్)కి బ్యాడ్ లక్ సఖి అని పేరుంటుంది. సఖి వల్ల ఎప్పుడూ పనులకు ఆలంకం కలుగుతుందని ఊరిజనం నమ్మకం. అప్పుడే సఖి షూటింగ్ ప్రతిభను గుర్తించిన కోచ్ (జగపతి బాబు) ఆమెకు షూటింగ్ లో కోచింగ్ ఇస్తారు. షూటింగ్ లో ఓడిపోతే రాహుల్ రామకృష్ణ సఖిని పెళ్లి చేసుకుంటా అంటాడు. కోచ్ అండర్ లో సఖి ట్రైయినింగ్ తీసుకొని బెస్ట్ షూటర్ గా పేరు తెచ్చుకుంటుంది. తన ఊరికి కూడా మంచి పేరు తీసుకువస్తుంది. అప్పడు కీర్తి ప్రతిభను చూసి బ్యాడ్ సఖి నుంచి గుడ్ లక్ సఖిగా మారిందని కీర్తిస్తారు.
సినిమా ఎలా ఉందంటే
కీర్తి సురేశ్ నటన ఈ సినిమాకు హైలైట్. జగపతి బాబు మరో సారి కోచ్ క్యారెక్టర్ లో లీనమై అద్భతంగా నటించారు. గోలిరాజు పాత్రలో ఆదిపినిశెట్టి యాక్టింగ్ కూడా బాగుంది. కథ, స్క్రీన్ ప్లే, రాహుల్ రామకృష్ణ కామెడీ చాలా బాగుంది. కుటుంబ సమేతంగా కలిసి ఈ సినిమాను ఓ సారి చూడవచ్చు.
