
హ్యూమన్ సాగర్, మంచిపేరున్న ఒడియా ప్లేబ్యాక్ గాయకుడు, తీవ్ర అనారోగ్య నేపథ్యంతో AIIMS, భువనేశ్వర్లో చికిత్స పొందుతూ 35 ఏళ్ల వయస్సులో మృతి చెందాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి మొదట మల్టీ-ఆర్గన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్, ఆక్యూట్-ఆన్- క్రానిక్ లివర్ ఫెయిల్యూర్, బైలేటరల్ న్యుమోనియా వంటి సమస్యల కారణంగా చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.
ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు కొన్నిరోజులుగా అతని మానసిక స్థితిలో కొన్ని మెరుగుదల కనిపించాయని, అతను కొద్దీ కొద్దిగా స్పందించడం ప్రారంభించినట్టు వైద్యుల బులెటిన్‌లో పేర్కొన్నారు. అయితే అతని శ్వాస వ్యవస్థ గంభీరంగా ఉండడంతో, హై వెంటిలేటర్ మద్దతుతో చికిత్స కొనసాగింది అని తెలిపారు.
ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి తన బాధ ప్రకటించి, కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. సంగీత ప్రపంచంలో, తన గాత్రంతో ఎంతో మంది అభిమానులని సంపాదించిన తన మరణం అభిమానులని ఇటు సంగీత సహోద్యుగులని కలిచివేసింది.
హ్యూమన్ సాగర్ తల్లి చెప్పింది ఏంటంటే, తన ఆరోగ్యం బాగా లేకున్నా, బలవంతంగా షోస్ చేయమని చెప్పారని పేర్కొంది. అయితే తన మేనేజర్ చెప్పింది ఏంటంటే, హ్యూమన్ సాగర్కి లివర్ అలైన్మెంట్ సమస్య నయం అయిపోయింది కానీ, తను సరిగా మందులు తీసుకోలేదు, ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు అని చెప్పారు.
