Idli Kottu OTT: ఇడ్లీ కొట్టు ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

Idli Kottu OTT

ధనుష్ మంచి నటుడిగానే కాదు, మంచి దర్శకుని గా కూడా పేరుతెచ్చుకున్నాడు. ఇక తన దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ఇడ్లీ కడై, తెలుగు ప్రేక్షకుల కోసం ఇడ్లీ కొట్టు పేరుతో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతోంది.

ఇడ్లీ కొట్టు చిత్రం అక్టోబర్ 29, 2025న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది. థియేటర్లలో ఘన విజయాన్ని సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటిటిలో ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.

ఈ చిత్రంలో ధనుష్, నిత్యా మెనన్, అరుణ్ విజయ్, శాలిని పాండే, సత్యరాజ్, రాజ్‌కిరణ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఇడ్లీ కడై సినిమాను ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించడమే కాకుండా, ఆకాశ్ భాస్కరన్ తో కలిసి డాన్ పిక్చర్స్ మరియు వండర్‌బార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై నిర్మించారు. సంగీతాన్ని జీ.వి. ప్రకాష్ కుమార్ అందించగా, సినిమాటోగ్రఫీని కిరణ్ కౌశిక్ నిర్వహించారు.

Related Articles

Latest Articles