చిరంజీవి తదుపరి చిత్రంలో కార్తీ – బాబీ దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్

Karthi in Chiranjeevi’s Next – A Grand Multistarrer Directed by Bobby

టాలీవుడ్‌ లో మరో సంచలన కాంబినేషన్ ఫిక్స్‌ అయింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమాలో హీరో కార్తీ కీలక పాత్రలో నటించనున్నట్టు సమాచారం.

ఈ భారీ ప్రాజెక్ట్‌కు బాబీ (కె.ఎస్.రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం తాత్కాలికంగా “మెగా 157” పేరుతో ప్రీ–ప్రొడక్షన్ దశలో ఉంది.

సమాచారం ప్రకారం, కార్తీ ఈ సినిమాలో పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు అని తెలుస్తుంది. చిరంజీవి పాత్రకు సమానంగా ఉండే ఈ రోల్‌ కథలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత బాబీ మరోసారి మెగా స్టార్ చిరంజీవితో కలిసి భారీ మాస్ గ్యాంగ్స్టర్ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నారు.

ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌ 2026 ప్రారంభంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అగ్రస్థాయి టెక్నీషియన్లు, భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో ఈ ప్రాజెక్ట్‌ రూపొందుతోంది. అధికారిక ప్రకటనతో పాటు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను త్వరలో విడుదల చేయనున్నారు అని సమాచారం.

చిరంజీవి–కార్తీ లాంటి ఇద్దరు నటులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారనే వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ఈ కాంబినేషన్‌ బాక్స్‌ ఆఫీస్ వద్ద దుమ్ములేపడం ఖాయం అని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related Articles

Latest Articles