
బన్నీ వాసు ప్రొడ్యూస్ చేసిన చిత్రం మిత్ర మండలి బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా విఫలమైంది. అయితే ఇప్పుడు OTT ప్రీమియర్‌కి సిద్ధమయింది.
మిత్ర మండలి నవంబర్ 6, 2025న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి రానుంది. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు, నిహారిక NM, ప్రసాద్ బెహరా తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ సినిమాకు విజయేందర్ S దర్శకత్వం వహించగా, RR ధ్రువన్ సంగీతం అందించారు. సిద్ధార్థ్ స్జ్ ఛాయాగ్రహణం వహించిన ఈ చిత్రాన్ని, కల్యాణ్ మంతినా, భాను ప్రతాప్, డా. విజయేందర్ రెడ్డి తీగల కలిసి నిర్మించారు. అలాగే, బన్నీ వాస్ ఈ చిత్రాన్ని BV వర్క్స్ బ్యానర్‌పై సమర్పించారు.
