
టాలీవుడ్‌లో మరో సెన్సేషనల్ మల్టీ స్టారర్ చిత్రం రాబోతోంది! ఎనర్జిటిక్ స్టార్ రవితేజ మరియు యంగ్ సెన్సేషన్ నవీన్ పొలిశెట్టి కలిసి నటించబోతున్న మల్టీ స్టారర్ సినిమా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
యాక్షన్, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ కలయికగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంటోంది అని సమాచారం.
ఈ సినిమా కథను ప్రసన్న కుమార్ బెజవాడ రాసారు. ఆయన రాసిన పలు కమర్షియల్ హిట్స్‌లా, ఈ ప్రాజెక్ట్ కూడా భారీ స్థాయిలో తెరకెక్కనుందని సమాచారం.
అయితే, దర్శకుడు ఇంకా ఫైనల్ కాలేదు. కొంతమంది ప్రముఖ దర్శకుల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
రవితేజ అంటేనే మంచి కామెడీ టైమింగ్ మరియు ఎనేర్జి, ఇక నవీన్ పోలిశెట్టి కామెడీ కూడా అద్దిరిపోతుంది. వీళ్ళద్దరు కలిసి తెర మీద కనిపిస్తే థియేటర్స్లో రచ్చ మాములుగా ఉండదు.
ఈ వార్తతో అభిమానుల్లో భారీ ఎక్సైట్మెంట్ నెలకొంది. మాస్ యాక్షన్‌కి నవీన్ పొలిశెట్టి కామెడీ కలిస్తే ఎలాంటి ఎంటర్‌టైనర్ వస్తుందో చూడాలి
సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఒక ప్రముఖ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. కామెడీ, యాక్షన్, ఎమోషన్‌ల మేళవింపుతో ప్రేక్షకులను అలరించే సినిమాగా ఉండబోతోందని సినీ వర్గాల టాక్.
సినిమా టైటిల్, నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
