
రవితేజ హీరోగా నటించిన మాస్ జాతర సినిమా థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది, ఇక ఇప్పుడు ఓటీటీలో రిలీజ్‌కి సిద్ధమైంది.
మాస్ జాతర నవంబర్ 28, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌కి రానుంది. ఈ సినిమాలో రవితేజతో పాటు శ్రీలీల, రాజేంద్ర ప్రసాద్, నవీన్ చంద్ర, నరేష్ మరియు మరికొందరు నటించారు.
భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. విదు అయ్యన్నా సినిమాటోగ్రఫీ చేయగా, నాగ వంశీ ఎస్ మరియు సాయి సౌజన్య ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మించారు.
