
బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ‘కాంతారా: ఎ లెజెండ్ – చాప్టర్ 1’ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. అయితే హిందీ వెర్షన్ ప్రస్తుతం అందుబాటులో లేదు, త్వరలో విడుదల కానుంది.
ఈ చిత్రంలో రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దర్శకత్వం రిషబ్ శెట్టి వహించగా, సంగీతం అజనీష్ లోకనాథ్, సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్. కాశ్యప్ అందించారు. హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
థియేటర్లలో ఈ విజువల్ స్పెక్టకిల్ చూడలేకపోయిన వారు, ఇప్పుడు తప్పక ఈ అద్భుతమైన చిత్రాన్ని ఓటీటీలో ప్రైమ్ వీడియోలో ఆస్వాదించండి.
