
ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ది రాజా సాబ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమా 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సినిమా టికెట్ల విడుదలపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
సినిమా పై ఉన్న హైప్‌ను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ ప్రత్యేకంగా ప్రీమియర్ షోస్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్రీమియర్ షోస్ టికెట్ ధరలు సాధారణ స్థాయిని మించనున్నాయి. కొన్ని ప్రధాన నగరాల్లో ప్రీమియర్ టికెట్ ధరలు వెయ్యి రూపాయలకుపైగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే సినిమా అధికారిక విడుదల రోజు అయిన జనవరి 9న మాత్రం టికెట్ ధరలు కొంత తగ్గనున్నాయని సమాచారం. సాధారణ షోలకు టికెట్ ధరలు రూ.500 నుంచి రూ.800 వరకు ఉండే అవకాశం ఉందని అంచనా. ధరలు ఎక్కువగానే ఉన్నప్పటికీ, ఇది ప్రభాస్ సినిమా కావడంతో ప్రేక్షకుల డిమాండ్ మాత్రం ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు.
ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ టికెట్ బుకింగ్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ స్థాయిలో విడుదల, గ్రాండ్ విజువల్స్, ప్రభాస్ స్టార్డమ్ కారణంగా ‘ది రాజా సాబ్’ టికెట్లకు భారీ డిమాండ్ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. మరి టికెట్ ధరలపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.
