భారత మాజీ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రవి శాస్త్రి సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై స్పందించారు.
తాజా ఇంటర్వ్యూలో రవి శాస్త్రి తెలిపింది ఏంటంటే, రోహిత్ శర్మ ఎలాగైతే టెస్ట్ క్రికెట్ కి రిటర్మెంట్ ప్రకటించాడో, విరాట్ కోహ్లీ కూడా అలానే ప్రకటించాడు. అయితే ఇది వాళ్ళిద్దరి వ్యక్తిగత నిర్ణయమే తప్ప, బోర్డు వాళ్ళకి చెప్పలేదు.
భారత జట్టు అక్టోబర్ 19, 2025 నుంచి ఆస్ట్రేలియాతో వచ్చే మూడు ఓడీయే సిరీస్‌కు సిద్దమవుతోంది. ఈ సిరీస్ లో మనం టెస్ట్ క్రికెట్ రిటర్మెంట్ తర్వాత, రోహిత్ మరియు విరాట్ లని చూస్తాం.
అయితే వాళ్లిదరు ఈ సిరీస్ కోసం చాల ప్రాక్టీస్ చేసారు, కచ్చితంగా వాళ్ళు అలరిస్తారు అని వ్యక్తం చేసారు.
ఇక 2027 వరల్డ్ కప్ కి ఆడాలా లేదా అనేది వారి వ్యక్తి గత నిర్ణయం అని తెలిపారు. ఫామ్, ఫిట్‌నెస్, మోటివేషన్ వంటి అంశాలు వారు వరల్డ్ కప్ లో పాల్గొనడంలో కీలక పాత్ర పోషిస్తాయని కూడా తెలిపారు.
మొత్తానికి, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తు అంతర్జాతీయ క్రికెట్‌లో చర్చనీయాంశంగా ఉన్నప్పటికీ, రవి శాస్త్రి వ్యాఖ్యల ప్రకారం వీరి ప్రయాణం ఇంకా ముగియలేదు అని అర్ధమవుతుంది.