ది రాజాసాబ్ మూవీ రివ్యూ: ప్రభాస్ కామెడీ వర్కౌట్ అయిందా?

ది రాజాసాబ్ మూవీ రివ్యూ

ఎంతగానో ఎదురుచూస్తున్నా ప్రభాస్ సినిమా ది రాజాసాబ్ ఎట్టకేలకు థియేటర్లో విడుదలైంది. మరి ఈ చిత్రం అంచనాలని అందుకుందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

రాజు(ప్రభాస్) నానమ్మ గంగాదేవికి అల్జీమర్స్ అనే జబ్బు ఉంటుంది. కానీ తన భర్త అయిన కనకరాజు (సంజయ్ దత్) మాత్రం గుర్తు ఉంటాడు. అయితే తన నానమ్మ కోరిక మేరకు, కనకరాజుని ఎలాగైనా తీసుకురావాలని, రాజు హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ అనుకోకుండా ఉరి చివర ఉన్న, ఒక పడు బద్ద బంగలోకి వెళ్లాల్సొస్తుంది, అక్కడ రాజు తాతా కనకరాజు గురించి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఏంటి ఆ విషయాలు అనేది సినిమాలో చూడాలి.

ప్రభాస్ చాలా కాలం తర్వాత పూర్తిస్థాయి కామెడీ పాత్రలో కనిపించడం రిఫ్రెషింగ్‌గా అనిపించింది. కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కామెడి వర్క్ అయ్యింది. సత్య కామెడీ కొంతమేరకు బాగా వర్కౌట్ అయింది. జరీనా వాహబ్ నటన ఆకట్టుకుంటుంది. సంజయ్ దత్ ఇంటెన్స్ పాత్రలో ప్రభాస్‌తో చేసే మైండ్ గేమ్స్ ఆసక్తికరంగా ఉంటాయి. రెండో భాగంలో కొన్ని సన్నివేశాలు సినిమాను కాస్త నిలబెట్టాయి.

దర్శకుడు మారుతీ సినిమా గురించి ఒక రేంజ్లో చెప్పారు, కానీ ఎగ్జిక్యూషన్ బలహీనంగా ఉండటం ప్రధాన లోపంగా మారింది. పాయింట్ బాగుంది కానీ, ముగ్గురు హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యం లేకపోవడం, వాళ్లతో రొమాంటిక్ ట్రాక్, పాటలు స్పీడ్ బ్రేక్స్ లాగ ఆటంకం కలిగాయి.

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓవర్‌గా ఉంది. ఎడిటింగ్ మరింత షార్ప్‌గా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ ఓకే అనిపించినా, విజువల్ ఎఫెక్ట్స్ సగటుగానే ఉన్నాయి.

మొత్తం మీద ది రాజాసాబ్ అంచనాలని అందుకోలేక పోయింది అనే చెప్పాలి.

Related Articles

Latest Articles