దీక్షిత్ శెట్టి బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి OTTకి రాబోతోంది

దీక్షిత్ శెట్టి బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి OTTకి రాబోతోంది

‘దసరా’ సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న దీక్షిత్ శెట్టి నటించిన ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ చిత్రం తెలుగులో విడుదల కావాల్సి ఉండగా, అనుకోని కారణాల వల్ల కేవలం కన్నడ భాషలో మాత్రమే థియేటర్లలోకి వచ్చింది.

ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ రిలీజ్‌కు సిద్ధమైంది. జనవరి 12, 2025 నుంచి ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది.

ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి సరసన బ్రిందా ఆచార్య కీలక పాత్రలో నటించగా, గోపాల్ కృష్ణ దేశ్‌పాండే, సాధు కోకిల, శృతి హరిహరన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమాకు అభిషేక్ ఎం. దర్శకత్వం వహించగా, జూడా సంధ్య సంగీతాన్ని అందించారు. అభిషేక్ జి. కాసరగోడ్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా, శ్రీదేవి ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై హెచ్.కే. ప్రకాశ్ గౌడ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Related Articles

Latest Articles