Athadu Aame Priyudu Movie Review: అతడు ఆమె ప్రియుడు సినిమా థియేటర్లలో ఈ రోజు, అంటే ఫిబ్రవరీ 4న గ్రాండ్ గా రిలీజ్ అయింది. థ్రిల్ తో పాటు కామెడీని మిక్స్ చేసిన సినిమా ఇదని, క్రిటిక్స్ సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కొందరు మాత్రం యెండమూరి వీరేంద్రనాద్ డైరెక్షన్ కాబట్టి సినిమాలో చాలా ఎక్స్ఫెక్టేషన్స్ తో వచ్చాము. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదని అంటున్నారు. ఈ మూవీ గురించిన మరిన్న వివరాలను తెలుసుకుందాం.
కథ
అతడు ఆమె ప్రియుడు మూవీలో అన్ని జానర్లూ ఉంటాయి. కరోనా వైరస్ ప్రకృతిపై ఎలా పగబట్టిందనేదాన్ని ఈ సినిమాలో ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకులు, ప్రముఖ రైటర్ యెండమూరి వీరేంద్రనాథ్. సునీల్ కామెడీ మనకు ఎక్కడా బోర్ ఫీల్ కాకుండా చేస్తుంది. కౌశల్ మంద, ఈ మూవీలో మెయిన్ లీడ్ రోల్ ప్లే చేశాడు. చిత్రంలో ఒకరిని హత్య చేస్తారు. చివరికి ఒక ఇంట్లో సునీల్, కౌషల్ మంద వీరంతా ఒక్కదగ్గరికి చేరిపోతారు. ప్రళయం రాబోతోందని, అందరూ చనిపోతారని సినిమాలోని ఓ క్యారెక్టర్ మనకు చెబుతుంది. ఏంటా ప్రళయం, ఎలా వస్తుందనే విశయాలు తెలుసుకోవాలంటే.. ఈ మూవీను చూడాల్సిందే.
అతడు ఆమె ప్రియుడు చిత్ర యూనిట్
ప్రముఖ దర్శకులు యెండమూరి వీరేంద్రనాథ్ ఈ సినిమాకు కథను అందించడంతో పాటు ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. సునీల్, కౌశల్ మంద ఈ మూవీలో మెయిన్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. రవి కనగాల, రామ్ తుమ్మలప్పలి కలిసి ఈ సినిమాను సంధ్య మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు.
మూవీ పేరు | అతడు ఆమె ప్రియుడు |
డైరెక్టర్ | యెండమూరి వీరేంద్రనాథ్ |
నటీనటులు | సునీల్, కౌశల్ మంద, బెనర్జీ, మహేవ్వరి వడ్డి, ప్రియాంక, సుపుర్ణ, భూషన్, జెన్ని |
నిర్మాతలు | రవి కనగాల, రాం తుమ్మలప్పలి |
ప్రొడక్షన్ బ్యానర్ | సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ |
సినిమా ఎలా ఉందంటే
అతడు ఆమె ప్రియుడు సినిమా రొమాంటిక్ కథ అయినప్పటికీ ఇందులో ఉండే థ్రిల్లింగ్ కాన్సెప్ట్ ను బాగా ప్రెజెంట్ చేశారు. డైలాగ్స్, డైరెక్షన్ ను మరింత బెటర్ స్టైల్ లో తెరకెక్కించి ఉంటే బాగుండేది. యెండమూరి వీరేంద్రనాధ్ దర్శకత్వం ఈ సినిమా వచ్చినప్పటికీ. ఎక్స్పెక్టేషన్స్ ను ఈ మూవీ రీచ్ కాలేక పోయింది.
మూవీ రేటింగ్ : 2.5 / 5