
ధ్రువ్ విక్రమ్ “బైసన్” సినిమా తమిళం మరియు తెలుగులో ఘన విజయాన్ని సాధించింది .ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ విడుదలకు సిద్ధమవుతోంది.
మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తన మార్క్ డైరెక్క్షన్ మరియు ధ్రువ్ విక్రమ్ అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
మేకర్స్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, “బైసన్” నవంబర్ 21, 2025 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
ఈ చిత్రంలో ధ్రువ్ విక్రమ్‌తో పాటు పసుపతి, ఆమిర్, లాల్, అనుపమ పరమేశ్వరన్, రాజిషా విజయన్, అళగం పెరుమాళ్, ఆరోవి మధన్, అనురాగ్ అరోరా తదితరులు నటించారు.
మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో, నివాస్ కె ప్రసన్న సంగీతాన్ని సమకూర్చగా, ఎజిల్ ఆరసు కె సినిమాటోగ్రఫీని నిర్వహించారు.
సమీర్ నాయర్, దీపక్ సేగల్, పా.రంజిత్, ఆదితి ఆనంద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఆప్లాజ్ ఎంటర్టైన్‌మెంట్ మరియు నీలం స్టూడియోస్ బన్నెర్స్ పైన నిర్మించారు.
తీవ్ర ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోన్న నేపథ్యంలో, థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇంట్లోనే ఈ సినిమాకి చెందిన గట్టి నాటకం మరియు శక్తివంతమైన నటనను ఆస్వాదించే వీలుంది.
