టాలీవుడ్ నటుడు శివాజీ, ఇటీవల #90s వెబ్ సిరీస్ మరియు ‘కోర్ట్’ చిత్రాలతో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు, ఆయన కొత్త క్రైమ్ థ్రిల్లర్ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం ETV Win ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో ప్రసారం కానుంది.
ETV Win వాళ్ళు టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల చేసారు, చూస్తుంటే క్రైమ్ కామెడీ లాగా అనిపిస్తుంది. #90s వెబ్ సిరీస్లో ఈ సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని బాక్గ్రౌండ్ మ్యూజిక్ లో విన్నాం, అది చాల ఫేమస్ అయింది కూడా. ఇక ఆ పేరుతోనే ETV Win సిరీస్ తీసుకొస్తుంది. ఈ టైటిల్ వల్ల ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది.
దర్శకుడు సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ ప్రధాన పాత్రలో నటించారు. ఇక శివాజీ సరసన లయా నటిస్తున్నారు.
ఈ చిత్రంలో అలీ, ధనరాజ్, ప్రిన్స్, జబర్దస్త్ ఎమాన్యుయేల్, రాజ్ తిరందాసు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం రంజిన్ రాజ్ అందించారు. ఈ చిత్రం శివాజీ స్వంత నిర్మాణ సంస్థ శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ ద్వారా నిర్మించబడింది.
‘సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని’ చిత్రం చిత్తూరు నేపథ్యంతో రూపొందించబడింది. ఈ చిత్రంలో శివాజీ మరియు లయా జంటగా నటించడం, వారి గత హిట్ చిత్రాల జంటను గుర్తు చేస్తుంది. ఈ చిత్రం ప్రేక్షకులను ఉత్కంఠభరితమైన కథతో ఆకట్టుకునే అవకాశం ఉంది.
ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుంది అనేది ఇంకా వెల్లడించలేదు.