టాలీవుడ్ నటుడు శివాజీ, ఇటీవల #90s వెబ్ సిరీస్ మరియు ‘కోర్ట్’ చిత్రాలతో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు, ఆయన కొత్త క్రైమ్ థ్రిల్లర్ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం ETV Win ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో ప్రసారం కానుంది.
ETV Win వాళ్ళు టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల చేసారు, చూస్తుంటే క్రైమ్ కామెడీ లాగా అనిపిస్తుంది. #90s వెబ్ సిరీస్లో ఈ సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని బాక్గ్రౌండ్ మ్యూజిక్ లో విన్నాం, అది చాల ఫేమస్ అయింది కూడా. ఇక ఆ పేరుతోనే ETV Win సిరీస్ తీసుకొస్తుంది. ఈ టైటిల్ వల్ల ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది.
దర్శకుడు సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ ప్రధాన పాత్రలో నటించారు. ఇక శివాజీ సరసన లయా నటిస్తున్నారు.
ఈ చిత్రంలో అలీ, ధనరాజ్, ప్రిన్స్, జబర్దస్త్ ఎమాన్యుయేల్, రాజ్ తిరందాసు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం రంజిన్ రాజ్ అందించారు. ఈ చిత్రం శివాజీ స్వంత నిర్మాణ సంస్థ శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ ద్వారా నిర్మించబడింది.
‘సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని’ చిత్రం చిత్తూరు నేపథ్యంతో రూపొందించబడింది. ఈ చిత్రంలో శివాజీ మరియు లయా జంటగా నటించడం, వారి గత హిట్ చిత్రాల జంటను గుర్తు చేస్తుంది. ఈ చిత్రం ప్రేక్షకులను ఉత్కంఠభరితమైన కథతో ఆకట్టుకునే అవకాశం ఉంది.
ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుంది అనేది ఇంకా వెల్లడించలేదు.
భారత ఫాస్ట్ బౌలర్ మోహమ్మద్ సిరాజ్, ICC మేన్‌స్ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో తన కెరీర్‌లో అత్యుత్తమ 12వ స్థానాన్ని చేరుకున్నారు. ఇది ఆయన అహ్మదాబాద్‌లో వెస్ట్…
పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో కలిసి తెరకెక్కించబోతున్న స్పిరిట్ సినిమా భారతీయ సినిమా చరిత్రలో ఒక కొత్త అధ్యాయం సృష్టించబోతోంది. Animal సినిమా…
ఓపెన్‌ఏఐ తన కొత్త AI-ఆధారిత వెబ్ బ్రౌజర్ చాట్‌జీపీటీ అట్లాస్ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ బ్రౌజర్ వినియోగదారులు ఇంటర్నెట్‌తో ఎలా ఇంటరాక్ట్ చేస్తారో మార్చే…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23న రానుంది. ఈసారి ఆయన అభిమానులకు ఇది నిజంగా పండుగ వారం కానుంది. రాబోయే సినిమాల నుండి వరుసగా…
ఇక చాల డిలే తర్వాత, మెడికల్ కౌన్సెల్లింగ్ కమిటీ (MCC) అధికారికంగా NEET PG 2025 కౌన్సెల్లింగ్ రౌండ్ 1 రిజిస్ట్రేషన్‌ను అక్టోబర్ 17, 2025 నుండి…
భారతదేశ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ ‘ఓలా శక్తి’ (Ola Shakti) ను అధికారికంగా ఆవిష్కరించింది. ]…