
కిరణ్ అబ్బవరం నటించిన తాజా కమర్షియల్ ఎంటర్‌టైనర్ “కే-రాంప్” బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ చిత్రం నవంబర్ 15, 2025న ఆహా వీడియోలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది.
థియేటర్లలో మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్‌లో మరో మాస్ హిట్‌గా నిలిచింది. మంచి కామెడీ తో, ముఖ్యంగా ఇదేమిటమ్మా మాయ పాట తో థియేటర్లలో మోత మోగింది.
కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తారేజా హీరోయిన్ గా చేసింది, నరేష్, ఆలీ, సాయి కుమార్, వెన్నెల కిశోర్, కమ్నా జెఠ్మలాని తదితరులు నటించారు.
జైన్స్ నాని ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు, మరియు ఈ చిత్రాన్ని రజేశ్ దండా మరియు శివ బొమ్మక్ నిర్మించారు.
