Kothala Rayudu Review: కోతల రాయుడు మూవీ రివ్యూ

Kothala Rayudu Movie Review: కరోనా వల్ల అనేక సార్లు వాయిదా పడి ఎట్టకేటలకు థియేటర్లలో విడుదలైంది కోతల రాయుడు. సినిమాలో శ్రీకాంత్..” సంపాదించేవాడికి 25 లక్షలంటే బిగ్ అమౌంట్.. సంపాదించేవాడికి ఏముందిరా బొక్కా.. అనే డైలాగ్ తోనే మూవీని మొత్తం అర్థం చేసుకోవచ్చు. తెలుగులో 2022లో వచ్చిన మంచి కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ నిలిచిపోనుంది.

Kothala Rayudu Movie Review

కథ

కోతల రాయుడు పాత్రలో శ్రీకాంత్ నటిస్తాడు. గుడికి వెళ్లి దేవుడిని.. తనను అంబానీకే అప్పిచ్చే ఆసామిని చేయమంటాడు.. దీంతో కోతల రాయుడు లైఫ్ లో మనీకు సంబంధించిన టర్నింగ్ పాయింట్లు వస్తుంటాయి. కోతలరాయుడుకు ప్రేమ కన్నా డబ్బే చాలా ఇష్టం. అందుకే డబ్బున్న అమ్మాయిలనే ప్రేమించి వివాహం చేసుకోవాలనుకుంటాడు. కోతల రాయుడుకి స్నేహితుడి పాత్రలో సత్యం రాజేశ్ నటిస్తాడు. చివర్లో ఈ సినిమా ఓ అనూహ్య మలుపు తిరుగుంది. అదేంటి అని తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

చిత్రం యూనిట్

సీహెచ్ సుధీర్ రాజు ఈ సినిమాకు కథను అందించడంతో పాటు అయనే దీన్ని డైరెక్ట్ చేశారు. శ్రీకాంత్, డింపుల్ చొపాడే, నటాషా దోషి మెయిన్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. పృథ్వి రాజ్, పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ, సత్యం రాజేశ్, హేమ సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటించారు. సునీల్ కశ్యప్ ఈ మూవీకి సంగీతాన్ని సమకూర్చారు. ఎఎస్ కిశోర్, కొలన్ వెంకటేశ్ కలిసి ఈ మూవీని ఎ.ఎస్.కె ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించారు.

మూవీ పేరు కోతల రాయుడు
దర్శకులు సిహెచ్. సుధీర్ రాజు
కథ, స్క్రీన్ ప్లే సిహెచ్. సుధీర్ రాజు
నటీ నటులు శ్రీకాంత్, నటాషా దోషి, డింపుల్ చొపాడే
సంగీత దర్శకులు సునీల్ కశ్యప్
నిర్మాతలు ఎఎస్ కిశోర్ & కొలన్ వెంకటేశ్
ప్రొడక్షన్ బ్యానర్ ఎ.ఎస్.కె ఫిలిమ్స్

సినిమా ఎలా ఉందంటే

శ్రీకాంత్ గత కొంత కాలంగా సీరియస్ క్యారెక్టర్లు చేస్తూ వచ్చారు. రీసెంట్ గా అఖండలో కూడా పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించారు. అయినప్పటికీ ఈ సినిమాతో ముందుకు వచ్చి మరో సారి మనల్ని బాగా నవ్వించారు. 90s, 2010 వరకు శ్రీకాంత్ చాలా వరకు కామెడీ సిినిమాలే చేశారు. చాలా ఏళ్ల తరువాత మళ్లీ అలాంటి సినిమా చేయడాన్ని శ్రీకాంత్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు.

మూవీ రేటింగ్ : 3.5 / 5

Related Articles

Latest Articles