RRR సినిమా లో మల్లి పాత్ర చేసిన.. చిన్నారి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

ఎన్నో రోజుల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు త్రిబుల్ ఆర్ సినిమా విడుదల అయ్యింది. ఇక ఈ సినిమా విడుదల కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూసిన అభిమానులు అందరూ కూడా థియేటర్లకు వెళ్లి సినిమా చూసి తరించి పోతున్నారు. రాజమౌళి తెరకెక్కించిన మరో అద్భుతమైన కళాఖండం ఫిదా అయ్యేలా చేసింది అంటూ ఇక ఈ సినిమాకు రివ్యూలు కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. ఇక ఇటీవలే విడుదలైన త్రిబుల్ ఆర్ సినిమా ప్రస్తుతం రికార్డులు కొల్లగొడుతూ దూసుకుపోతుంది అదే విషయం తెలిసిందే. కేవలం 3 రోజుల్లోనే 500 కోట్ల రికార్డును కొల్లగొట్టింది ఈ సినిమా.

ట్వింకిల్ శర్మ

ఇక ఈ సినిమాలో కొమురంభీం పాత్రలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు నటించిన రామ్ చరణ్ తన కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అని చెప్పాలి.  రాజమౌళి ఒకవేళ హీరోలు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా ఇక ఇచ్చేంత వరకు ఎన్ని టేకుల అయినా చేస్తూ ఉంటాడు. అంతలా క్లారిటీతో ఉంటాడు జక్కన్న. ఇక హీరోలు హీరోయిన్లు జక్కన్న సినిమా లో అందరికి తెలిసిన వారే ఉంటారు. కానీ ఇక సహాయ పాత్రల్లో నటించే వారు మాత్రం కొత్తవారిని తెచ్చి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాడు రాజమౌళి.

 అచ్చంగా త్రిబుల్ ఆర్ సినిమాలో కూడా ఇలాగే ఒక సరికొత్త నటి ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆమె ఎవరో కాదు త్రిబుల్ ఆర్ సినిమా కు కధ మొదలవడానికి కారణమైన మల్లి. అదేనండి కొండ ఉయ్యాల కోన ఉయ్యాల అనే పాట పాడుతూ బ్రిటిష్ రాణికి పచ్చబొట్టు వేస్తోంది. ఆ తర్వాత ఆమెను బ్రిటిష్ వాళ్ళు ఇక కోటకి తీసుకెళతారు. అక్కడి నుంచి సినిమా మొదలవుతుంది. ఇక ఈ అమ్మాయి పాత్ర పోషించింది ఎవరు అని వెతకడం ప్రారంభించారు అందరు.

ఈమె పేరు ట్వింకిల్ శర్మ అంతకుముందు డాన్స్ ఇండియా అనే కాంపిటీషన్ లో పాల్గొన్నది. తర్వాత బీస్ట్ డ్రామెబాజ్ లో టాప్ 8 కంటెస్టెంట్ గా నిలిచింది. హిందీ జీ ఛానల్ లో ఎన్నో ఈవెంట్లో పాల్గొన్నారు. ఫ్లిప్కార్ట్ ప్రకటనలలో కూడా నటించింది. ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక ఈ చిన్నారి తన పాత్రలో ఒదిగిపోయి నటించి ప్రేక్షకులను ఫిదా చేసింది అని చెప్పాలి..

Keep visiting https://taazavaarthalu.com/

Related Articles

Latest Articles