Saamanyudu Movie Review: విశాల్ ప్రధాన పాత్రలో నటించిన సామాన్యుడు చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అయి మంచి టాక్ ను రాబట్టుకుంది. మరో సారి మాస్ క్యారెక్టర్ తో విశాల్ ప్రేక్షకులను అలరించాడు. యోగీ బాబు కామెడీతో కడుపుబ్బా నవ్వామని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. విశాల్ తమిళ స్టార్ అయినప్పటికీ ఇక్కడ కూడా ఓపనింగ్స్ బాగా వచ్చాయి. సామాన్యుడు సినిమా తమిళ్ లో వీరమై వాగై సూడుమ్ గా రిలీజ్ అయింది.
కథ
సామాన్యుడు సినిమా కథ మొత్తం ఓ మర్డర్ కేసు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. విశాల్ ఒక పోలీస్ ఆస్పిరెంట్. యోగీ బాబు అతనికి ఫ్రెండ్. పోలీస్ జాబ్ వద్దని విశాల్ కు యోగి బాబు చెబుతుంటాడు. అయినా విశాల్ పట్టించుకోడు. డింపుల్ హయతీ, విశాల్ ఇద్దరూ ప్రేమించుకుంటాడు. అయితే ఈ మర్డర్ కేసును చేధించే క్రమంలో విశాల్ ఎన్ని సమస్యలను ఎదుర్కొంటాడు.. వాటిని ఎలా అధిగమిస్తాడనేదే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్.
సామాన్యుడు సినిమా నటీనటులు
తు పా శరవాణన్ ఈ సినిమాకు కథ ను రాసి ఆయనే దర్శకత్వం వహించారు. యాక్టర్ విశాల్ తన సొంత బ్యానర్ పై ఆయనే దీన్ని నిర్మించారు. డింపుల్ హయతీ హీరోయిన్ గా యోగీ బాబు సపోర్టివ్ క్యారెక్టర్ గా యాక్ట్ చేశారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూరిస్తే.. కెవిన్ రాజ్ సినిమాటోగ్రఫీని, ఎన్బీ శ్రీకాంత్ ఎడిటింగ్ బాధ్యతలను స్వీకరించారు.
మూవీ పేరు | సామాన్యుడు |
దర్శకత్వం | తు పా శరవాణన్ |
నటీనటులు | విశాల్, డింపుల్ హయతీ, యోగి బాబు |
సంగీతం | యువన్ శంకర్ రాజా |
సినిమాటోగ్రఫీ | కెవిన్ రాజ్ |
ఎడిటింగ్ | ఎన్బీ శ్రీకాంత్ |
నిర్మాత | విశాల్ |
ప్రొడక్షన్ బ్యానర్ | విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ |
సినిమా ఎలా ఉందంటే
ఒక సామాన్యుడు ఒక మర్డర్ కేసులోని మిస్టరీలను ఎలా చేధించారనే దాన్ని దర్శకుడు తుప శరవానన్ అద్భతంగా తెరకెక్కించారు. విశాల్ ప్రడ్యూస్ చేసిన ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతుంది. యోగీ బాబు కామెడీ కూడా ఈ సినిమాకు ప్లస్ అవుతుంది.