Telusu Kada OTT: సిద్ధు జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా OTTలోకి రావడానికి సిద్ధమైంది

Telusu Kada OTT

సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘తెలుసు కదా’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ప్రేక్షకులు మరియు విమర్శకులు ఈ చిత్రంలోని వినూత్నమైన కథను ప్రశంసించారు.

ఇప్పుడు ఈ చిత్రం OTTలోకి రావడానికి సిద్ధమైంది. ‘తెలుసు కదా’ నవంబర్ 14, 2025 నుంచి Netflixలో స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ, రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి, హర్ష చెముడు మరియు మరికొందరు నటించారు.

సినిమాకు నీరజ కోనా దర్శకత్వం వహించగా, థమన్ ఎస్ సంగీతం సమకూర్చారు. జ్ఞానశేఖర్ వీ.ఎస్. ఛాయాగ్రహణం నిర్వహించగా, టీ.జీ. విశ్వప్రసాద్ మరియు కృతీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

చూడాలి మరి ఈ చిత్రాన్ని OTT లో ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో.

Related Articles

Latest Articles