మిత్రమండలి సినిమా ఈ రోజు రిలీజ్ కానుంది. అయితే, రిలీజ్‌కి ముందే నిర్మాతలు ప్రీమియర్‌ను ఘనంగా నిర్వహించారు. ప్రీమియర్‌కు మీడియా,సినీ ప్రముఖులతో పాటు, ప్రేక్షకులకి కూడా అందుబాటులో ఉండేలా నిర్వహించారు.
అయితే, సినిమా ప్రమోషన్ సమయంలో ఈ సినిమాలోని నటులు గాని మరియు నిర్మాత బన్నీ వాసు సినిమా గురించి ఒక రేంజ్ లో ప్రమోట్ చేసారు. అంటే, ఈ సినిమా చూసే ప్రేక్షకులు ప్రతి క్షణం నవ్వుతారు అని, ఈ సినిమా నచ్చకపోతే నా నెక్స్ట్ సినిమా చూడొద్దు అని, పెద్ద పెద్ద మాటలే మాట్లాడారు. ఇక వీటి వల్ల, విడుదలకూ ముందు ప్రేక్షకులకి సినిమాపై మరింత ఆసక్తి పెంచింది.
కానీ, రీసెంట్ గా లిటిల్ హార్ట్స్ కి ప్రీమియర్స్ వేసినప్పుడు, వచ్చిన టాక్ వస్తాడేమో అని అనుకున్నారేమో గాని, ఈ సినిమాకి పూర్తి విరుద్ధంగా జరిగింది, సినిమా అస్సలు బాగాలేదు అని, రివ్యూస్ ఒస్తున్నాయి.
ఇది సినిమా పైన చాల పెద్ద భారమే పడుతుంది, అసలు నిర్మాతలు మరి అన్ని మాటలు చెప్తూ ఎందుకు ప్రచారం చేశారు అని ఆశ్చర్యపడుతున్నారు.
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, “మిత్రమండలి” ఎలా ఆడుతుందో చూడాలి. ఎందుకంటే, చాల సినిమాలు విడుదల అవుతున్నయి.