ఒక్కసారిగా యూట్యూబ్ ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయిపోయింది. ఈ అవుటేజ్ అమెరికా, యూరోప్, భారత్, జపాన్, ఆస్ట్రేలియా మరియు ఇతర ప్రాంతాల్లోని కోట్లాది వినియోగదార్లను ప్రభావితం చేసింది.
వినియోగదారులు యూట్యూబ్ వీడియోస్, యూట్యూబ్ మ్యూజిక్, యూట్యూబ్ TV యాక్సెస్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు అని పేర్కొన్నారు. ఎక్కువ మంది “Playback error” లేదా “Something went wrong” అనే లోపాలను చూసారు.
DownDetector ప్రకారం, అవుటేజ్ సమయంలో 6 లక్షల పైగా రిపోర్ట్స్ నమోదు అయ్యాయి. అయితే అవుటేజ్ మధ్యాహ్నం ప్రారంభమై కొన్ని గంటల పాటు కొనసాగింది. ఈ సమయంలో వినియోగదారులు స్లో లోడింగ్, మరియు కొన్ని సందర్భాల్లో పూర్తిగా కంటెంట్ యాక్సెస్ చేయలేకపోయారు.
యూట్యూబ్ మ్యూజిక్‌లో ఆఫ్లైన్ డౌన్‌లోడ్‌లు పని చేసాయి, కానీ స్ట్రీమింగ్ సర్వీసులు ప్రధానంగా అందుబాటులో ఉండలేదు.
యూట్యూబ్ తర్వాత ఈ సమస్యని పూర్తిగా పరిష్కరించబడిందని నిర్ధారించింది. అయితే అవుటేజ్ కారణంపై ప్రత్యేక వివరాలు అయితే వెల్లడించలేదు.
అవుటేజ్ సమయంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వినియోగదారులు తమ నిరాశ మరియు సృజనాత్మకతను వ్యక్తం చేసే మిమ్స్, హాస్యపూరిత పోస్టులు షేర్ చేశారు.