పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో కలిసి తెరకెక్కించబోతున్న స్పిరిట్ సినిమా భారతీయ సినిమా చరిత్రలో ఒక కొత్త అధ్యాయం సృష్టించబోతోంది.
Animal సినిమా విజయానంతరం, సందీప్ రెడ్డి వంగ ప్రభాస్‌తో కలిసి స్పిరిట్ నిర్మిస్తున్నారు, ఇది ప్రభాస్ 25వ సినిమాగా అనౌన్స్ చేసారు, కానీ ప్రభాస్ బిజీ షెడ్యూల్ వల్ల, 4 సంవత్సరాలు ఆలస్యం అయిపోయింది.
ఇక ఎట్టకేలకు, ఈ సమ్వత్సరంలో సినిమా ప్రారంభం కాబోతుంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ప్రభాస్ బర్త్డే సందర్బంగా, స్పిరిట్ కి సంబందించిన అప్డేట్ రాబోతుంది అని కూడా సమాచారం.
అయితే అందరు ఇప్పటివరకు స్పిరిట్ ఒక స్టాండలోన్ సినిమా అనుకున్నారు, కానీ తాజా వార్తల ప్రకారం కాదు అని గట్టిగా వినిపిస్తుంది. ఈ స్పిరిట్ సినిమాని, మంచి హై నోట్ తో ముగించి ఒక “కాప్ యూనివర్స్” లాగ చేయాలి అని సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
ఇప్పటికే ఈ సినిమాకి ఒక రేంజ్లో హైప్ ఉంది, ఇక కాప్ యూనివర్స్ అని తెలిసాక అంచనాలు రెట్టింపు అయ్యాయి.