
యష్ నటిస్తున్న అత్యంత ఆసక్తికరమైన చిత్రం ‘టాక్సిక్ (Toxic)’ ఫస్ట్ గ్లింప్స్ తాజాగా విడుదలై భారీ చర్చకు దారి తీసింది. గీతూ మోహందాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా, విడుదలైన కొద్ది గంటల్లోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఈ గ్లింప్స్ ప్రారంభం నుంచే విజువల్స్ పరంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హాలీవుడ్ స్థాయి సినిమాలను తలపించేలా ఉన్న సాంకేతిక విలువలు, నిర్మాణ ప్రమాణాలు ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేలా కనిపిస్తున్నాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ దర్శకురాలి విజన్ స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ చిత్రంలో యష్ ‘రాయా’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన ఎంట్రీకి ముందు ఇచ్చిన బిల్డ్-అప్ అద్భుతంగా ఉండగా, అసలు పరిచయ సన్నివేశం ఫైర్‌వర్క్స్‌తో అదిరిపోయేలా ఉంది. యష్ రివీల్‌ను ఎంతో స్టైలిష్‌గా, ఇంపాక్ట్‌తో తెరకెక్కించడం గ్లింప్స్‌కే హైలైట్‌గా నిలిచింది.
గీతూ మోహందాస్ ఈ చిత్రంతో స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామాను, మాస్ ఎలిమెంట్స్‌తో మేళవించి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని గ్లింప్స్ స్పష్టంగా సూచిస్తోంది. కథనం, విజువల్స్, పాత్రల ప్రెజెంటేషన్ అన్నీ కలిపి ఓ బలమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించనున్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా టాక్సిక్ ఫస్ట్ గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. యష్ అభిమానులతో పాటు సినీ ప్రేమికుల్లోనూ భారీ ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం, థియేటర్లలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
