ఆది సాయి కుమార్ శంభాల OTT రిలీజ్ డేట్ ఫిక్స్

ఆది సాయి కుమార్ శంభాల OTT రిలీజ్ డేట్ ఫిక్స్

నటుడు ఆది సాయి కుమార్ మంచి విజయాన్ని అందుకోవడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాడు. చివరకు తాజాగా విడుదలైన మిస్టికల్ థ్రిల్లర్ చిత్రం “శంభాల”తో భారీ బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

థియేటర్లలో విడుదలకన్నా ముందే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ఆహా వీడియో ప్లాట్‌ఫామ్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా 2026 జనవరి 22 నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది.

ఈ చిత్రంలో ఆది సాయి కుమార్‌తో పాటు అర్చనా అయ్యర్, స్వాసిక విజయ్, మధునందన్, రవివర్మ, మీసాల లక్ష్మణ్, షిజు మీనన్, హర్ష వర్ధన్, శివ కార్తిక్, ఇంద్రనీల్, శైలజా ప్రియ, అన్నపూర్ణ అమ్మ, ప్రవీణ్, తదితరులు నటించారు.

ఉగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఇక సంగీతాన్ని శ్రీచరణ్ పాకాల అందించగా, సినిమాటోగ్రఫీని ప్రవీణ్ కె బంగార్రి నిర్వహించారు.షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నాభిమోజు ఈ చిత్రాన్నినిర్మించారు.

Related Articles

Latest Articles