
కుమారి 21F’ సినిమా ఫేమ్ హెబ్బా పటేల్ నటించిన తాజా థ్రిల్లర్ చిత్రం ‘మారియో’.
థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ, ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.
ఈ చిత్రానికి సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా వీడియో సొంతం చేసుకుంది. జనవరి 23, 2026 నుంచి ఈ సినిమా ఆహా వీడియోలో ప్రీమియర్ కానుంది.
ఈ సినిమాలో హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించగా, అనిరుధ్ శ్రీవత్సవ్, రాకేందు మౌళి, యష్నే, మదీ మణేపల్లి, కల్పిక గణేష్, మౌర్య సిద్ధవరం తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.
‘మారియో’ చిత్రానికి కళ్యాణ్‌జీ గోగన దర్శకత్వం వహించారు. సంగీతాన్ని సాయి కార్తిక్ మరియు రాకేందు మౌళి అందించారు. ఈ సినిమాను ప్రఖ్యా అనిరుధ్ శ్రీవత్సవ్ నిర్మించగా, సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్, రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థల సహకారంతో తెరకెక్కించారు.
