
ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన తన AI సంస్థ X AI ద్వారా రూపొందించిన కొత్త ఆన్‌లైన్ ఎన్సైక్లోపీడియా ‘Grokipedia’ను అక్టోబర్ 27, 2025న అధికారికంగా ప్రారంభించారు.
ఇది వికీపీడియాకు ప్రత్యామ్నాయంగా, “సమతుల్యంగా” ఉన్న జ్ఞాన వేదికగా మస్క్ వివరించారు.‘Grokipedia’ ప్రస్తుతం సుమారు 8.8 లక్షల ఆర్టికల్స్ ప్రారంభమైంది. వికీపీడియాలో ఉన్న 80 లక్షలకుపైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్తో పోలిస్తే ఇది తక్కువే అయినా, యూసర్ ఫ్రెండ్లీ గా ఉంటది అని పేర్కొన్నారు. ఈ వెబ్‌సైట్ డార్క్ థీమ్ డిజైన్‌తో రూపొందించబడింది మరియు దీనిలోని విషయాలు Grok అనే AI భాషా మోడల్ ద్వారా రూపొందించబడతాయి.
ఎలాన్ మస్క్ గతంలోనే వికీపీడియా పై విమర్శలు చేశారు. ఆయన దానికి “లిబరల్ బైయస్” ఉందని ఆరోపించారు.
అదే సమయంలో, వినియోగదారుల అభిప్రాయాలు, X (మాజీ ట్విట్టర్) లైవ్ ఫీడ్స్ ఆధారంగా వెంటనే అప్‌డేట్ అయ్యే ఎన్‌సైక్లోపీడియా సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. Grokipedia ద్వారా “నిజానికి అత్యంత దగ్గరగా ఉండే సమాచారం” అందించడమే ఆయన ఉద్దేశం.
ప్రారంభం నుంచే ‘Grokipedia’ పై విమర్శలు వెల్లువెత్తాయి.వికీపీడియాకి కాపీ అని, చాల ఆర్టికల్స్ వికీపీడియా పేజీలనుంచి యథాతథంగా కాపీ చేసుకున్నట్లు ఆరోపణలు చేసారు.
ప్రస్తుతం Grokipedia వర్షన్ 0.1లో ఉందని, ప్రస్తుతం టెస్టింగ్ దశగా మాత్రమే కొనసాగుతోందని X AI తెలిపింది. మస్క్ బృందం భవిష్యత్తులో డేటా ఖచ్చితత్వం, ఎడిటింగ్ వ్యవస్థ, మరియు యూజర్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మార్పులు చేయాలని యోచిస్తోంది.
Grokipedia ప్రాజెక్ట్ నిజంగా వికీపీడియాకు పోటీగా నిలుస్తుందా, లేదా కేవలం వివాదాస్పద ప్రయోగంగానే మిగిలిపోతుందా అన్నది కాలమే నిర్ణయించాలి.
