News

NEET PG 2025 కౌన్సెల్లింగ్: రౌండ్ 1 రిజిస్ట్రేషన్ ప్రారంభం

ఇక చాల డిలే తర్వాత, మెడికల్ కౌన్సెల్లింగ్ కమిటీ (MCC) అధికారికంగా NEET PG 2025 కౌన్సెల్లింగ్ రౌండ్ 1 రిజిస్ట్రేషన్‌ను అక్టోబర్ 17, 2025 నుండి ప్రారంభించింది.

ఈ రౌండ్, భారత దేశంలో పీజీ మెడికల్ కోర్సులు చదువుకోవాలని ఆశించే మెడికల్ గ్రాడ్యుయేట్స్‌కు ఒక ముఖ్యమైన దశ.

కౌన్సెల్లింగ్ ప్రక్రియలో ముఖ్యమైన దశలు

రిజిస్ట్రేషన్:
NEET PG 2025 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అధికారిక MCC వెబ్‌సైట్ mcc.nic.in ద్వారా రిజిస్టర్ కావాలి. రిజిస్ట్రేషన్ సమయంలో NEET PG రోల్ నంబర్ మరియు పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటది.

కోర్సులు మరియు కళాశాలల ఎంపిక (Choice Filling & Locking):

రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత అభ్యర్థులు తమ ఇష్టమైన కోర్సులు మరియు కళాశాలలను ఎంచుకోవాలి. ఎంపికలను తుది ధృవీకరణ కోసం లాక్ చేయడం చాలా అవసరం.

సీటు కేటాయింపు:

అభ్యర్థుల మెరిట్ మరియు ఎంపికలను బట్టి సీట్లు కేటాయించబడతాయి. సీటు కేటాయింపు ఫలితాలు MCC పోర్టల్‌లో ప్రకటించబడతాయి.

అలాట్మెంట్ అయిన కళాశాలకు రిపోర్ట్ చేయడం:

సీటు కేటాయింపైన అభ్యర్థులు ఇచ్చిన సమయపాలనలో కళాశాలకు హాజరు అవుతూ అడ్మిషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి.

కౌన్సెల్లింగ్ షెడ్యూల్

MCC వెబ్‌సైట్‌లో అధికారిక షెడ్యూల్ అందుబాటులో ఉంది. కౌన్సెల్లింగ్ సాధారణంగా రౌండ్ 1, రౌండ్ 2, మాప్-అప్ రౌండ్, స్ట్రే వెకెన్సీ రౌండ్ వంటి రౌండ్లలో జరుగుతుంది.

అర్హత ప్రమాణాలు

NEET PG 2025 పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం.

కేటగిరీ-వైజ్ కట్-ఆఫ్, రిజర్వేషన్ విధానాల కోసం MCC ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ని పరిశీలించడం.

ముఖ్య సూచనలు

డాక్యుమెంట్ వెరిఫికేషన్: కావాల్సిన అన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి.

రిజర్వేషన్ పాలసీలు: సీబీ‌సీ ప్రభుత్వం కింద SC, ST, OBC, EWS మరియు PwD కేటగిరీలకు రిజర్వేషన్లు వర్తించును.

నిరంతరంగా వెబ్‌సైట్‌ను పరిశీలించండి: MCC అధికారిక వెబ్‌సైట్
నుండి తాజా అప్డేట్స్ మరియు పూర్తి సమాచారం పొందవచ్చు.

ఈ కౌన్సెల్లింగ్ ప్రక్రియ, మెడికల్ గ్రాడ్యుయేట్స్‌కు పీజీ మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ పొందడానికి ఒక అత్యంత ముఖ్యమైన అవకాశంగా ఉంది. అభ్యర్థులు సమయపాలనలో రిజిస్టర్ అవ్వడం మరియు అన్ని దశలను జాగ్రత్తగా అనుసరించడం ద్వారా సాఫీగా అడ్మిషన్ పొందగలరు.

Srija Reddy

Recent Posts

ఓలా ఎలక్ట్రిక్ కొత్త ప్రాజెక్ట్‌ ‘ఓలా శక్తి’ ఆవిష్కరణ – భారతీయ ఇంధన నిల్వ రంగంలో కొత్త అధ్యాయం!

భారతదేశ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తాజాగా తన కొత్త ప్రాజెక్ట్‌ ‘ఓలా శక్తి’ (Ola Shakti) ను అధికారికంగా ఆవిష్కరించింది. ]…

3 days ago

Kishkindhapuri Movie OTT: ఓటీటీలో ఎందుకు రిలీజ్ కాలేదు మరియు ఎప్పుడు రిలీజ్ అవుతుంది?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హర్రర్ థ్రిల్లర్ కిష్కింధపురి, OTT విడుదల అక్టోబర్ 17 న ZEE5 లో అని చెప్పారు. తీరా…

3 days ago

Rohit Sharma and Virat Kohli Retirement: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై రవి శాస్త్రి వ్యాఖ్యలు

భారత మాజీ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రవి శాస్త్రి సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై స్పందించారు. తాజా ఇంటర్వ్యూలో రవి…

4 days ago

Youtube Down: ప్రపంచవ్యాప్తంగా YouTube డౌన్,ప్లే బ్యాక్ ఎర్రర్, యాక్సెస్ సమస్యలు

ఒక్కసారిగా యూట్యూబ్ ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయిపోయింది. ఈ అవుటేజ్ అమెరికా, యూరోప్, భారత్, జపాన్, ఆస్ట్రేలియా మరియు ఇతర ప్రాంతాల్లోని కోట్లాది వినియోగదార్లను ప్రభావితం చేసింది. వినియోగదారులు…

4 days ago

Mithra Mandali: ప్రీమియర్ వేసి తప్పు చేసారా?”

మిత్రమండలి సినిమా ఈ రోజు రిలీజ్ కానుంది. అయితే, రిలీజ్‌కి ముందే నిర్మాతలు ప్రీమియర్‌ను ఘనంగా నిర్వహించారు. ప్రీమియర్‌కు మీడియా,సినీ ప్రముఖులతో పాటు, ప్రేక్షకులకి కూడా అందుబాటులో…

4 days ago

అమెజాన్‌లో భారీ ఉద్యోగాల కోత – హెచ్‌ఆర్‌ విభాగంలో 15% సిబ్బందిని తొలగించనున్న అమెజాన్‌

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌ మరోసారి పెద్ద స్థాయిలో ఉద్యోగుల కోతకు సిద్ధమవుతోంది. ఈసారి లక్ష్యంగా పెట్టుకున్నది హ్యూమన్‌ రీసోర్సెస్‌ (HR) విభాగాన్ని. నివేదికల…

5 days ago