గత కొంత కాలం నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామాన్య ప్రజలందరిపై కూడా భారం మోపే విధంగా పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప పెట్రోల్ ధరలు తగ్గించడానికి మాత్రం ఎక్కడ ప్లాన్ చేయడం లేదు. దీంతో రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్ ధరలుసామాన్యుడి జీవితాన్ని మరింత భారంగా మార్చుతున్నాయ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ఉపాధి సరిగ్గా దొరక్క ఇబ్బంది పడుతున్న జనాలకి నిత్యావసరాల ధరలు పెరిగి పోవడంతో ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయి.
ఇక ఎప్పుడు పెట్రోల్ ధరలు కూడా భారీగా పెరిగిపోవడంతో అత్యవసరమైతే తప్ప వాహనాన్ని బయటకు తీయడం లేదు. ఇక ఇప్పుడు పెట్రోల్ ధరలు ప్రతిరోజు పెరుగుతున్నాయ్. పెరుగుతుంది కేవలం పైసలు అనిపించినప్పటికీ ఇక ఒక వారంలో దాదాపు ఐదు రూపాయలకు పైగానే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. ఈరోజు లీటర్ పెట్రోల్ పై 80 పైసలు డీజిల్ పై 70 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఈరోజు 8 గంటల నుంచి అమల్లోకి రాబోతున్నాయి. వారం వ్యవధిలో ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం ఏడవ సారి కావడం గమనార్హం.
కాగా ప్రస్తుతం హైదరాబాద్లో లీటరు పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 76 పెరగటంతో లీటర్ పెట్రోల్ ధర రూ.113.61, డీజిల్ ధర రూ.99.83లుగా ఉంది. మరోవైపు విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.115.37లు, డీజిల్ రూ.101.23లుగా కొనసాగుతుంది. ఇక గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.115.57, డీజిల్ రూ.101.43లుగా ఉంది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.100.21గా ఉంటే.. డీజిల్ లీటరుకు రూ.91.47గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.115.04లుగా కొనసాగుతుండగా.. డీజిల్ రూ.99.25గా ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగిపోవడంతో రానున్నరోజుల్లో పెట్రోల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Keep visiting: https://taazavaarthalu.com/