iQOO 15 పూర్తి స్పెసిఫికేషన్స్: 7000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, ఫాస్ట్ చార్జింగ్

iQOO 15

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO తన కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ iQOO 15 ను అధికారికంగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీ, మెరుగైన కెమెరా పనితనం వంటి ఫీచర్లతో ఈ ఫోన్ ఇప్పటికే టెక్ వర్గాల్లో మంచి హైప్‌ను సృష్టించింది. ఈసారి కంపెనీ పూర్తిగా ప్రీమియం ఫీచర్లపై దృష్టి పెట్టింది.

iQOO 15 లో కొత్త Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌ను ఉపయోగించడం ప్రధాన ఆకర్షణ. ఈ చిప్‌సెట్ వేగవంతమైన పనితీరుతో పాటు గేమింగ్ అనుభవాన్ని కూడా మరింత మెరుగుపరుస్తుంది. అధిక పనితీరును హ్యాండిల్ చేసేందుకు ప్రత్యేక కూలింగ్ సిస్టమ్‌ను కూడా ఇందులో అమర్చారు.

ఫోన్‌లో 7000mAh భారీ బ్యాటరీని అందించారు. ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్‌లో చాలా అరుదుగా కనిపించే స్పెసిఫికేషన్. దీని వల్ల హెవీ యూసేజ్ ఉన్నప్పటికీ సింగిల్ ఛార్జ్‌తో సులువుగా ఒక రోజు పాటు పనిచేస్తుంది. ఫోన్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది, దింతో కొద్ది నిమిషాల్లోనే ఎక్కువ శాతం ఛార్జ్ అవుతుంది.

డిస్ప్లే విషయంలో కూడా iQOO 15 తన క్లాస్‌కు తగ్గట్టే ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. 6.85 అంగుళాల 2K OLED స్క్రీన్, అధిక రిఫ్రెష్‌రేట్, ఎక్కువ బ్రైట్నెస్ వంటి ఫీచర్లు వీడియోలు, గేమింగ్ మరియు సాధారణ వాడకంలో అద్భుతమైన విజువల్ అనుభవాన్ని అందిస్తాయి.

కెమెరా విభాగంలో ప్రీమియం ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. ప్రధాన సెన్సార్‌తో పాటు అల్ట్రావైడ్, టెలిఫోటో లెన్స్‌లను కూడా అందించడం వల్ల ఫోటోలు, వీడియోలు మరింత క్వాలిటీతో వస్తాయి. నైట్ మోడ్, 4K రికార్డింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, iQOO 15 Android ఆధారంగా కొత్త యూజర్ ఇంటర్ఫేస్‌తో వస్తోంది. ఇది స్మూత్ మరియు కస్టమైజేషన్ చేయదగిన అనుభవం ఇస్తుంది. దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ కూడా అందించనున్నారు.

మొత్తానికి, iQOO 15 ఈ ఏడాది వచ్చిన అత్యంత శక్తివంతమైన ఫ్లాగ్షిప్ ఫోన్లలో ఒకటిగా చెప్పొచ్చు. శక్తివంతమైన ప్రాసెసర్, 7000mAh బ్యాటరీ, ప్రీమియం కెమెరాలు, అద్భుతమైన డిస్ప్లే అన్నీ కలిపి ఇది పవర్ యూజర్ల నుండి గేమింగ్ లవర్స్ వరకూ అందరికీ సరిపోయే ఆల్‌రౌండర్ ఫోన్‌గా నిలుస్తోంది.

Related Articles

Latest Articles